Monday, May 30, 2011

http://andhralovers.com/news/g/171


బికినీలు, లిప్‌లాక్‌లకు నేను చాలా దూరం అంటోంది తమన్నా.


బికినీలు, లిప్‌లాక్‌లకు నేను చాలా దూరం అంటోంది పాలబుగ్గల సుందరి తమన్నా. నిన్నటి మొన్నటి వరకు తమిళ తంబీలకు కంటిమీద కునుకులేకుండా చేసిన ఈ మిల్కీభామ ప్రస్తుతం తమిళ చిత్రాలకు గ్యాప్ ఇచ్చినట్లే ఉంది. దీంతో ఒక్కసారిగా తమిళ తంబీలు డీలా పడిపోయారట. ఇదే విషయం తమన్నా వద్ద ప్రస్తావిస్తే మూతిని ముప్పై వంకరలు తిప్పుతూ వివరణ ఇచ్చింది. నేనెక్కడ తమిళ చిత్రాలకు గ్యాప్ ఇచ్చానని ప్రశ్నించింది.

        దనుష్ సరసన వేంగై చిత్రంలో నటించనున్నానాని చెప్పుకొచ్చింది. కాకపోతే ప్రస్తుతం తన డైరీ మొత్తం టాలీవుడ్ చిత్రాలకు కేటాయించడంతో తమిళ చిత్రాలకు గ్యాప్ వచ్చినట్టు ఫీలవుతున్నారని తెలిపింది. తెలుగులో ఎంత బిజీగా ఉన్నా త మిళ చిత్రాలను వదలుకోనని తెలివిగా మాట్లాడుతోంది.

        అది సరే తెలుగు చిత్రం కందిరీగలో జూనియర్ ఎన్టీఆర్‌తో లిప్‌లాక్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయన్న ప్రశ్నకు అగ్గిమీద గుగ్గిలమైంది. లిప్‌లాక్‌లకు, బికినీలకు నేను చాలా దూరం, నిర్మాతలకు ఈ నిబంధన చెప్పాకే చిత్రాన్ని అంగీకరిస్తానని విరుచుకుపడింది. సో..తమన్నాను బికినీలో చూడాలని ఆశించే వారి కలలు కల్లలే నన్నమాట.







http://andhralovers.com/news/g/172


నేను నోరు విప్పితే చాలామంది బజారున పడతారు సెక్సీభామ మల్లిక శరావత్ .


ఇటీవల జరిగిన కాన్స్ చలనచిత్రోత్సవాల్లో బాలీవుడ్ సెక్సీభామ మల్లిక శరావత్ చేసిన హల్‌చల్ అంతా ఇంతకాదు. లోదుస్తులు కనిపించేట్టుగా ఉండే పలుచని నలుపురంగు గౌనులో క్యాట్ వాక్ చేసి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురి చేశారు. ఇలాంటి ఫీట్లు చేయడం మల్లికాకు కొత్తకాకపోయినా... అక్కడ అలా చేయడం మాత్రం వివాదాస్పదమైంది. భారతీయ సంస్కృతిని మంటగలిపే విధంగా మల్లికా ప్రవర్తించిందని, దీనికి ఆమె తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బాలీవుడ్ ప్రముఖులతో పాటు, మీడియా కూడా మండిపడింది.

       ఈ విషయంపై కొందరు ఔత్సాహికులు కోర్టుకెక్కడానికి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా మల్లికాకు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ‘‘అంత ఆనందంగా ఉంటే ఎక్కమనండీ... నేను ఇచ్చుకోవాల్సిన వివరణ నా దగ్గర రెడీగా ఉంది’’ అని ఏ మాత్రం బెరుకు లేకుండా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు మల్లిక. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘బురద జల్లడానికి నేను దొరికానా...? ఎవరెవరు అక్కడికి ఎలాంటి డ్రస్సులతో వచ్చారో, ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి.

      నేను నోరు విప్పానంటే... చాలామంది బతుకులు బజారున బడతాయి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు’’ అని చిన్న సైజు వార్నింగ్‌ని కూడా జారీ చేసేశారు. మల్లికా వైఖరి చూస్తుంటే... ఏదో ముందుగానే ప్లాన్ చేసుకొని వివాదం కోసం ఎదురు చూస్తున్నట్టుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దగా సినిమాలు లేకపోయినా... ఎప్పటికప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలవడం మల్లికాకే సాధ్యం అని చెప్పాలి.

Saturday, May 28, 2011

పగటి కలలు ఫలిస్తాయా!? రాత్రుళ్లో వచ్చే కలల సంగతేంటి!?


పగటి కలలు ఫలిస్తాయా!? రాత్రుళ్లో వచ్చే కలల సంగతేంటి!?
మనిషికి కలలు రావటమనేది సహజం. మనస్సుకు సంబంధించిన అంశంపై, కలలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. నెరవేరని ఆశలు మనస్సులోతుకి వెళ్తాయని అవే కలల రూపంలో వస్తుంటాయంటారు. అయితే కలలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫలితాలుంటాయి. ముఖ్యంగా పగటి కలలు ఫలించవని జ్యోతిష్యులు చెపుతుంటారు.

       నిద్రించిన వెంటనే వచ్చే కలలకు ఫలితాలుండవు. నిద్రించిన వెంటనే వచ్చే కలలు, పగటిపూట వచ్చే కలలన్నీ నెరవేరని ఆశల రూపమేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే అర్థరాత్రి 12.30 గంటలకు తర్వాత వచ్చే కలలను కాలానుగుణంగా విభజించారు. రాత్రి 12.30 గంటల నుంచి రెండు గంటల వరకు వచ్చే కలలు మూడు నెలల్లో నెరవేరుతాయని, రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల్లోపు వచ్చే కలలు ఒకే నెలలో నెరవేరుతాయి.

       ఇకపోతే.. మూడు గంటల నుంచి తెల్లారుజాము 5.30 గంటల్లోపు వచ్చే కలలు వెంట వెంటనే ఫలితాలనిస్తాయని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు, మూడు గంటల నుంచి 5.30 గంటల వరకు వచ్చే కలలు మంచి ఫలితాలనిస్తాయని వారు చెబుతున్నారు.