Saturday, May 28, 2011

పగటి కలలు ఫలిస్తాయా!? రాత్రుళ్లో వచ్చే కలల సంగతేంటి!?


పగటి కలలు ఫలిస్తాయా!? రాత్రుళ్లో వచ్చే కలల సంగతేంటి!?
మనిషికి కలలు రావటమనేది సహజం. మనస్సుకు సంబంధించిన అంశంపై, కలలపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. నెరవేరని ఆశలు మనస్సులోతుకి వెళ్తాయని అవే కలల రూపంలో వస్తుంటాయంటారు. అయితే కలలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫలితాలుంటాయి. ముఖ్యంగా పగటి కలలు ఫలించవని జ్యోతిష్యులు చెపుతుంటారు.

       నిద్రించిన వెంటనే వచ్చే కలలకు ఫలితాలుండవు. నిద్రించిన వెంటనే వచ్చే కలలు, పగటిపూట వచ్చే కలలన్నీ నెరవేరని ఆశల రూపమేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే అర్థరాత్రి 12.30 గంటలకు తర్వాత వచ్చే కలలను కాలానుగుణంగా విభజించారు. రాత్రి 12.30 గంటల నుంచి రెండు గంటల వరకు వచ్చే కలలు మూడు నెలల్లో నెరవేరుతాయని, రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల్లోపు వచ్చే కలలు ఒకే నెలలో నెరవేరుతాయి.

       ఇకపోతే.. మూడు గంటల నుంచి తెల్లారుజాము 5.30 గంటల్లోపు వచ్చే కలలు వెంట వెంటనే ఫలితాలనిస్తాయని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు, మూడు గంటల నుంచి 5.30 గంటల వరకు వచ్చే కలలు మంచి ఫలితాలనిస్తాయని వారు చెబుతున్నారు.

No comments:

Post a Comment