Sunday, July 3, 2011

http://andhralovers.com/news/g/227


http://andhralovers.com/news/g/226
నాలాగా మిగతా స్టార్స్ ఆలోచించాలి " ప్రియాంకచోప్రా "..



http://andhralovers.com/news/g/226
నాలాగా మిగతా స్టార్స్ ఆలోచించాలి " ప్రియాంకచోప్రా ". నీతులు చెప్పినంత తేలికకాదు ఆచరించడం. మంచిని తాను ఆచరిస్తూ... ఎదుటివారికి చెప్పేవారు ప్రస్తుతం చాలా అరుదు. అలాంటి వారిలో బాలీవుడ్ అందాలరాశి ప్రియాంకచోప్రా ఒకరు. అందంలోనే కాదు, సమాజశ్రేయస్సును కాంక్షించడంలో కూడా ప్రియాంక ముందుంటారు. రాజస్థాన్‌లో ‘అభివృద్ధి’కి ఆమడ దూరంలో ఉన్న అయిదు కుగ్రామాలను ఇటీవలే ఈమె దత్తతు తీసుకున్నారు. ఆ గ్రామాలకు కావాల్సిన కనీస అవసరాలన్నింటినీ తీరుస్తూ అక్కడి ప్రజానీకానికి ఆరాధ్య దేవతగా మారారు ప్రియాంక.

        నీటి వసతి, రవాణా, విద్యుత్, విద్య, వైద్యం ఇలా అన్ని సౌకర్యాలనూ అందించి ఆ గ్రామాలను సస్యశ్యామలం చేశారు ప్రియాంక. ‘కోట్లను కూడబెట్టడమే కాదు... ఆర్జించిన డబ్బులో కొంతైనా సమాజ క్షేమానికి ఉపయోగిస్తే అప్పుడే ఆ సంపాదనకు సార్థకత’ అని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్న ప్రియాంక ఔదార్యానికి, సేవానిరతికి నివ్వెరపోవడం తోటి నాయికల వంతైంది. ఈ విషయం గురించి ప్రియాంక మాట్లాడుతూ -‘‘ఆత్మ సంతృప్తి అంటే ఏంటో నాకు ఇటీవలే తెలిసింది. ఒక కళాకారిణిగా పదుగురికి ఆనందాన్ని పంచినప్పుడు కూడా నేనింత ఆనందపడలేదు.

       తన కోసం, తనవారి కోసం ఓ సామాన్యుడు బతకడం తప్పు కాదు. కానీ నా లాంటి సెలబ్రిటీలు కూడా అలా ఆలోచించడం తప్పు. పదితరాలు తిన్నా తరగని ఆస్థిని సొంతం చేసుకున్నప్పుడు మనల్ని ఈ స్థాయికి తెచ్చిన ప్రజల గురించి కూడా ఆలోచించాలి. ఈ రోజు నేను ముందుకొచ్చినట్టే... నా లాంటి మరికొంతమంది స్టార్స్ ముందుకొస్తే... నా ప్రయత్నం సఫలం అయినట్టే’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంక.



http://andhralovers.com/news/g/227
ఫ్రెండ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్ ...

http://andhralovers.com/news/g/227
ఫ్రెండ్స్ అభిమానులకు గుడ్‌న్యూస్ ...
ఐశ్వర్యరాయ్ అమ్మ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లో - అభిషేక్, ఐష్‌లకు పుట్టబోయే బిడ్డ గురించి చర్చించుకుంటున్నారు. ఈ దంపతులిద్దరూ అందంగా ఉంటారు కాబట్టి పుట్టబోయే బిడ్డకు కూడా ఆ అందం వస్తుందని అంటున్నారు. మరోవైపు ఐశ్వర్యరాయ్ సినిమా కెరీర్ గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఆమె అంగీకరించిన ‘హీరోయిన్’ సెట్స్ మీదకు వెళ్లడం సందేహమే అని తెలుస్తోంది. అమ్మ కాబోతున్నారు కాబట్టి ఐష్ శరీరాకృతిలో మార్పు రావడం సహజం అని భావించి, మధుర్ వేరే కథానాయికతో ‘హీరోయిన్’ని తెరకెక్కించాలనుకుంటున్నారట.

     ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మధుర్ నుంచి వెలువడలేదు. ఇదిలా ఉంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరమవుతారనే చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే అమ్మ అయిన తర్వాత కూడా బాలీవుడ్‌లో విజయవంతంగా కెరీర్ సాగిస్తున్న తారలు ఉన్నారు కాబట్టి ఐష్ సినిమాలకు ముగింపు పలకరని చాలామంది భావిస్తున్నారు. అదే నిజమవుతోంది కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్య చేయబోయే తొలి చిత్రం దాదాపు ఖరారయ్యిందని సమాచారం. అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా, అభిషేక్ బచ్చన్‌తో ‘ప్లేయర్స్’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వయాకామ్ 18’ బేనర్ ఐశ్వర్య రాయ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించనుందట.

     ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభించనున్నారని తెలిసింది. అంటే.. ఐష్‌కి డెలివరీ అయిన కొన్ని నెలలకు ఈ సినిమా ఆరంభం అవుతుందన్నమాట. ఇటీవల ఈ నిర్మాణ సంస్థకు చెందినవారు ఐష్‌కి కొన్ని కథలు చెప్పారట. ఆ కథలు అందాల సుందరిని ఇన్‌స్పయిర్ చేశాయని, త్వరలో ఓ కథను ఆమె ఎన్నుకుంటారని బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ఐష్ అభిమానులకు శుభవార్తే. వాస్తవానికి పెళ్లవ్వకముందుకన్నా ఆ తర్వాతే హీరోయిన్‌గా బాగా బిజీ అయ్యారు ఐష్. కావున అమ్మయిన తర్వాత కూడా ఆమెకు ఏ మాత్రం క్రేజ్ తగ్గదని చెప్పొచ్చు.

No comments:

Post a Comment